telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

మంచినీటిని ఆదా చేయడంపై ఏపీ ప్రభుత్వం దృష్టి…

cm jagan

మంచినీటిని ఆదా చేయడంపై ఏపీ ప్రభుత్వం దృష్టి, పరిశ్రమలకు డీశాలినేషన్‌ చేసిన నీటిని, శుద్ధిచేసిన నీటిని అందించడంపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్ ప్రధానంగా చర్చించారు… ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. పరిశ్రమలకు డీశాలినేషన్‌ చేసిన సముద్ర జలాలను అందించాలి.. డీశాలినేషన్‌ ప్లాంట్లను ప్రమోట్‌ చేసేలా చర్యలు తీసుకోవాలి.. రీసైకిల్‌ చేసిన నీటిని కూడా పరిశ్రమలకు ఇవ్వాలని ఆదేశించారు. రిజర్వాయర్లు, కాల్వల్లోని ఉపరితల జలాలను పూర్తిగా ఆదా చేసుకోవాలని సూచించిన సీఎం… పరిశ్రమలకు అందుబాటులో నీటిని ఉంచాల్సిన బాధ్యత ఏపీఐఐసీదే అన్నారు. పరిశ్రమలకు అవసరమైన క్వాలిటీ నీటిని అందించడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.. పకడ్బందీగా డీశాలినేషన్‌ చేసి.. నాణ్యమైన నీటిని పరిశ్రమలకు, పారిశ్రామిక వాడలకు అందించాలని స్పష్టం చేశారు. సముద్ర తీర ప్రాంతాల్లో డీశాలినేషన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసి.. పైపులైన్‌ ద్వారా ఈ నీటిని పరిశ్రమలకు అందించాలన్న ఆయన.. ఈ వ్యవహారాల సమన్వయ బాధ్యత ఏపీఐఐసీ చేపట్టాలని పేర్కొన్నారు. సాగు కోసం వినియోగించే నీటిని పరిశ్రమలు వినియోగించుకోకుండా డీశాలినేషన్‌ లాంటి ప్రత్యామ్నాయాలను అన్వేషించాలన్నారు.

Related posts