telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సహకార ఎన్నికలకు మోగిన నగారా

After 11 Parishat Elections Telangana

తెలంగాణలో మరో ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 15 వ తేదీన సహకార సంఘాల ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు గురువారం నోటిఫికేషన్ వెలువడింది. ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. నామినేషన్ల పరిశీలన తొమ్మిదిన ఉంటుంది.

10 వ తేదీన నామినేషన్ల ఉపసంహరణలు. 15 వ తేదీన ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. అదే రోజున మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. లెక్కింపు పూర్తైన వెంటనే ఫలితాలను వెల్లడిస్తారు.

Related posts