telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కాలుష్యం నేపథ్యంలో .. ఢిల్లీలో కార్యాలయాల పనివేళల్లో మార్పులు..

public health emergency in delhi

ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతుండటంతో ప్రభుత్వ కార్యాలయాల పనివేళలను మార్చాలని ఢిల్లీ సర్కారు నిర్ణయించింది. వాయు కాలుష్యం ధాటికి పాఠశాలలకు మూడు రోజులు సెలవులు ప్రకటించడంతోపాటు ప్రభుత్వ కార్యాలయాల పనివేళలను మార్చారు. ఢిల్లీలో ఈ నెల 4 నుంచి 15వతేదీ వరకు 21 ప్రభుత్వ శాఖలు ఉదయం 9.30 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు, మరో 21 ప్రభుత్వ విభాగాలు ఉదయం పదిన్నర నుంచి రాత్రి ఏడు గంటల వరకు పనిచేసేలా వేళలను మార్చారు. ఈ మేర ప్రభుత్వ విభాగాల వారీగా సర్కారు నోటిఫికేషన్ ను శనివారం విడుదల చేసింది. ఢిల్లీలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించి, అన్ని రకాల భవన నిర్మాణ పనులను నిషేధించారు.

కాలుష్యాన్ని తగ్గించేందుకు వీలుగా ప్రజారవాణాను బలోపేతం చేయాలని కేజ్రీవాల్ సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగా 2వేల ప్రైవేటు బస్సులను అద్దెకు తీసుకొని నడపాలని నిర్ణయించారు.ఫరీదాబాద్, గురుగావ్, ఘజియాబాద్, నోయిడా, గ్రేటర్‌లోని ఎన్‌సిఆర్ పట్టణాల్లో బొగ్గు ఆధారిత పరిశ్రమలను (విద్యుత్ ప్లాంట్లు మినహా) మూసివేయాలని సర్కారు ఆదేశించింది.పంజాబ్, హర్యానాల నుంచి వస్తున్న పొగ రాజధానిలో వాయు కాలుష్యానికి కారణమవుతోందని, దీనిని నియంత్రించాలని విజ్ఞప్తి చేస్తూ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాయాలని సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ నగరంలోని పాఠశాల విద్యార్థులకు సూచించారు.దీంతో పలువురు విద్యార్థులు రెండు రాష్ట్రాల సీఎంలకు కాలుష్యాన్ని నియంత్రించాలని కోరుతూ లేఖలు రాశారు.

Related posts