డిల్లీ అఖిలపక్ష సమావేశంలో టీడీపీ ఎంపీలు పాల్గొన్నారు. అనంతరం ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ అమరావతి రాజధాని అంశాన్ని సమావేశంలో ప్రస్తావించామని చెప్పారు. మూడు రాజధానులు చేస్తామంటూ రాష్ట్రంలో తీసుకొచ్చిన పరిస్థితులపై చర్చించాలని కోరామన్నారు. రాజధాని రైతుల ఆందోళనల్ని పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. తనపై దాడి చేశారని, ప్రివిలేజ్ మోషన్ ద్వారా చర్చ జరపాలని జయదేవ్ డిమాండ్ చేశారు.
మూడు రాజధానులపై చర్చించాలని అఖిలపక్షంలో కోరామని ఎంపీ కనకమేడల రవీంద్ర తెలిపారు. రాజధాని అంశంపై మాట్లాడుతుండగా వైసీపీ ఎంపీలు మధ్యలో అడ్డుపడ్డారని విమర్శించారు. ఎవరి అభిప్రాయాలను వారిని చెప్పనివ్వాలని.. కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సహా పలువురు వైసీపీ ఎంపీలకు చెప్పారని పేర్కొన్నారు. శాసనమండలి రద్దు అంశాన్ని చర్చించాలని కోరామని ఎంపీ కనకమేడల రవీంద్ర తెలిపారు.
ఏపీలో ప్రతిపక్షం చేతులెత్తేసింది…