telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

బ్రేకింగ్ : వివేకా మర్డర్ కేసు విచారణ కోసం మరో సీబీఐ టీమ్

నేటి నుంచి మళ్ళీ వివేకా హత్య కేసు విచారణ ప్రారంభం కానుంది. ముందు నుండీ విచారణ చేశ్తోన్న సీబీఐ బృందంలో ఏడుగురికి కరోనా సోకడంతో విచారణకి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఒక దశలో ఈ కేసు విచారణ నిలిచోపోనుందని కూడా అన్నారు. అయితే అనూహ్యంగా రంగంలోకి మరో కొత్త బృందం వచ్చింది. సీబీఐ బృందంలోని 15మంది సభ్యుల్లో ఏడుగురికి కరోనా సోకింది. దీంతో ఐసోలేషన్ కేంద్రాల్లో ఏడుగురు సభ్యులు చికిత్స పొందుతున్నారు. వివేకా హత్య కేసు విచారణకు బ్రేక్ పడటంతో వారి స్థానాల్లో కొత్త టీమ్ వచ్చి చేరనుంది.

 

ఢిల్లీ నుంచి కడపకు ఈ రోజు కొత్త సీబీఐ బృందం చేరుకునే అవకాశం ఉంది. సీబీఐ అధికారులు కడపకు చేరుకున్నాక యధావిధిగా విచారణ కోనసాగే అవకాశం ఉంది. కేసు  దర్యాప్తులో సిబిఐ ఎవరూ ఊహించని విధంగా  కొత్త విషయాలు, కొత్త వ్యక్తులను వెలుగులోకి తీసుకొస్తోంది. హత్య కేసును మొదట దర్యాప్తు చేసిన సిట్ బృందాలు పసిగట్టలేని సరికొత్త అంశాలను సిబిఐ గుర్తిస్తోంది. అయితే గతంలో సిట్ బృందాల తరహాలోనే కేసు దర్యాప్తును సిబిఐ కూడా సాగదీస్తోందనే చర్చ కూడా సాగుతోంది. దాదాపు 40 రోజుల విరామం తర్వాత సీబీఐ.. మళ్లీ విచారణ ప్రారంభించింది. అయితే ఈ  సుదీర్ఘ విరామంలో సిబిఐ కేసుకు సంబంఛింది చాలా వర్క్ చేసినట్లు తెలుస్తోంది

Related posts