ఏపీ సీఎం జగన్ విధానాలపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ విమర్శలు గుప్పించారు. మూడు రాజధానుల పేరుతో వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మద్యం ఏరులైపారిందని ఆయన చెప్పారు. జనం పనుల్లేక ఇబ్బందులు పడుతుంటే సీఎం జగన్‌కు పట్టట్లేదన్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ జగన్ అసలు రూపం బయటపడిందని, ఒక్క అవకాశమంటూ అధికారంలోకి వచ్చిన ఆయన ఇప్పుడు తన నిజస్వరూపాన్ని చూపుతున్నారని విమర్శించారు.
ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపితే కేసులుపెడుతున్నారని కన్నా విమర్శించారు.అప్రజాస్వామిక పనులను ప్రశ్నించకూడదా? అని కన్నా లక్ష్మీ నారాయణ ప్రశ్నించారు. రాష్ట్రంలో అప్రజాస్వామికం నడుస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదిలో చేపట్టిన నీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.