telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“బిగ్ బాస్-4” కు దూరం కానున్న నాగార్జున

Nag

వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 4 నాలుగు వారాలు పూర్తి చేసుకొని ఐదో వారంలోకి అడుగుపెట్టింది. ఈవారం నామినేషన్ ప్రక్రియలో రచ్చ మాములుగా లేదు. మొత్తానికి కంటెస్టెంట్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నారు. ఇక బిగ్‌ బాస్‌ సీజన్‌ 3 హోస్ట్‌గా మెప్పించిన కింగ్‌ నాగార్జున సీజన్‌ 4లో కూడా హోస్ట్ గా కొనసాగుతున్నారు. షోలో సెల‌బ్రెటీలు పెద్ద‌గా లేక‌పోయినా, తన టైమింగ్‌ పంచ్‌లు, వాక్చాతుర్యంతో బిగ్‌ బాస్‌ సీజన్‌ 4కు అదిరిపోయే రేటింగ్స్ తెచ్చిపెడుతున్నారు. వారాంతంలో వస్తూ షో టీఆర్పీ రేటును అమాంతం పెంచేస్తున్నారు. అయితే తాజాగా నాగార్జున బిగ్‌ బాస్‌ షోకి దూరంగా ఉంటారని షాకింగ్‌ న్యూస్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కింగ్ నాగార్జున హీరోగా దర్శకుడు సోలోమన్ దర్శకత్వంలో “వైల్డ్ డాగ్” అనే ఓ యాక్షన్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈ సినిమా షూటింగ్‌.. కరోనా వల్ల వాయిదా పడింది. త్వ‌ర‌లో థాయ్ లాండ్‌లో కీల‌క‌మైన షెడ్యూల్ జ‌ర‌గ‌బోతోంది. క‌నీసం 20 రోజుల పాటు షూటింగ్ సాగ‌నుంద‌ట‌. ఈ 20 రోజులూ బిగ్ బాస్ కి నాగ్‌ దూరం కానున్నారట. శ‌ని, ఆది వారాల‌లో… అంటే దాదాపు 6 ఎపిసోడ్ల‌లో నాగ్ క‌నిపించ‌డు. ఆయా ఎపిసోడ్ల‌ని ఎవ‌రితో భ‌ర్తీ చేయాలి? అనే విష‌యంలో బిగ్ బాస్ నిర్వాహ‌కులు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతున్నారట. గతంలో లాగా రమ్యకృష్ణతో కానీ లేదా ఇంకెవరితోనైనా షోను రన్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట బిగ్‌బాస్ నిర్వాహకులు.

Related posts