telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఈరోజు చెన్నైకి రానున్న శశికళ…

IT handover assests of sasikala

అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష ముగించుకున్న శశికళ.. తొలిసారి చెన్నైకి వస్తున్నారు. దీంతో చిన్నమ్మ వర్గం ఆనందంలో మునిగి తేలుతోంది. తమిళనాడు సరిహద్దులోని హొసూరు నుంచి చెన్నై వరకు రోడ్డు మార్గంలో ఏడు జిల్లాల మీదుగా శశికళ ప్రయాణం సాగనుంది. శశికళ రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయానికి వస్తే ఆమెను అడ్డుకునేందుకు అధికార పక్షం ముందస్తు చర్యలు తీసుకుంది. ఆ కార్యాలయం చుట్టూ ఉన్న మార్గాల్ని నిఘా వలయంలోకి  తీసుకొచ్చారు. అలాగే.. జయ లలిత సమాధి సందర్శనకు అనుమతి రద్దు చేసిన దృష్ట్యా.. శశికళ అక్కడికి వెళ్లినా అడ్డుకోవాలని నిర్ణయించారు. అయితే చిన్నమ్మ తమిళనాడులో అడుగుపెట్టబోతుండటం తమిళ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. మరీ ముఖ్యంగా అధికార అన్నాడీఎంకేలో కలవరం మొదలైంది. శశికళ చెన్నైకి వస్తుండటంతో ఆమె వర్గం తమిళనాడులో అల్లర్లకు, హింసాత్మక చర్యలకు పాల్పడాలని భావిస్తోందని అన్నాడీఎంకే నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే కాదు, సొంత పార్టీ నేతలకు కూడా అన్నాడీఎంకే కీలక హెచ్చరిక చేసింది. శశికళ చెన్నైకి వస్తున్నందున ఆమెను కలిసేందుకు అన్నాడీఎంకే నేతలు ఎవరు వెళ్లినా ఉపేక్షించేంది లేదని.. పార్టీ నుంచి బహిష్కరిస్తామని అధిష్టానం స్పష్టం చేసింది. తమిళనాడులో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనుండటంతో శశికళ ఎంట్రీతో పార్టీలో చీలికలు తప్పవని అన్నాడీఎంకే నేతలు కలవరపడుతున్నారు.

Related posts