telugu navyamedia
సినిమా వార్తలు

అనుష్క గోల్డ్ ఇయర్ కఫ్… ధర ఎంతంటే ?

Anushka

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ఇటీవల కాలంలో సినిమాలను బాగా తగ్గించింది. షారూక్ ఖాన్‌తో నటించిన “జీరో” తర్వాత ఇప్పటివరకు అనుష్క మరో సినిమాకు ఓకే చెప్పలేదు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో వివాహానికి ముందు తన గ్లామరస్ ఫోటోలను, బికినీ ఫోటోలను రెగ్యులర్‌గా సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసేది. పెళ్ళి తరువాత కూడా బికినీ ధరించిన హాట్ ఫోటోలను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. అనుష్కశర్మ తాజాగా ముంబైలో జరిగిన ఒక ఈవెంట్‌కు హాజరయ్యింది. ఈ సందర్భంగా అనుష్క ఆకట్టుకునే లుక్‌లో కనిపించింది. తన చెవికి గోల్డ్ ఇయర్ కఫ్ పెట్టుకుంది. గతంలో టెన్నిస్ ప్లేయర్ సెరీనా విలియమ్స్ కూడా తన చెవికి ఇటువంటి ఇయర్‌ కఫ్ పెట్టుకుని ఫొటోషూట్‌లో పాల్గొంది. తాజాగా అనుష్క ఇటువంటి ఇయర్ కఫ్ పెట్టుకుని ఫొటోషూట్‌లో పాల్గొనడం హైలెట్‌గా నిలిచింది. ఈ ఇయర్ కఫ్‌కు గ్రీన్ ఎమరాల్డ్ స్టోన్ జతచేసి వుంది. దీని ధర సుమారు రూ. 30 వేలు ఉంటుందని తెలుస్తోంది. లూజ్ హెయిర్ లుక్‌తో కనిపిస్తున్న అనుష్కను చూసి ఆమె అభిమానులు ఫిదా అయిపోతున్నారు.

Related posts