telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హుజూర్‌నగర్‌ కౌంటింగ్‌ కు సర్వం సిద్దం

evm with candidate photos

రేపు జరగబోయే హుజూర్‌నగర్‌ ఉప ​ఎన్నికల కౌంటింగ్‌కు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్‌ గోదాముల్లో ఈ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌లో ఈవీఎంలను భద్రపరిచారు. స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయగా, కేంద్ర పారామిలటరీ బలగాలు పహారా కాస్తున్నాయి. కౌంటింగ్ పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు.

ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 22 రౌండ్లలో ఈవీఎంల లెక్కింపు నిర్వహించనున్నారు. ఒక్కో రౌండ్‌కు 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌కు మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారు. మధ్యాహ్నాం 2 గంటల లోపే ఫలితంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే వీటి పరిసరాలన్నీ అధికారులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సీసీ ఫుటేజీ మొత్తం అభ్యర్థులు లైవ్‌లో 24 గంటలు చూసుకునేలా సౌకర్యం కల్పించారు.

Related posts