telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

టీడీపీ-కాంగ్రెస్ స్నేహం.. ఆ ముగ్గురితో దూరం పెంచుతుందా..!

why mayavati didi akilesh not attended diksha

ఢిల్లీలో ఏపీసీఎం చంద్రబాబు నాయుడు చేసిన ధర్మదీక్షకు అసలు అతిధులు రాకపోవటం పట్ల ప్రస్తుతం చర్చ నడుస్తుంది. వారు రాకపోవటానికి కారణంగా, టీడీపీ-కాంగ్రెస్ స్నేహం అనేది చెప్పబడుతుంది. అయితే అది ఎంతవరకు నిజమైన కారణం అనేది తెలియదు. మొత్తానికి మాయావతి, మమతా, అఖిలేష్ లు ఈ దీక్షకు డుమ్మా కొట్టారు. ఇటీవల మమతా తలపెట్టిన సత్యాగ్రహ కు కూడా చంద్రబాబు స్వయంగా వెళ్లి మద్దతు తెలిపినా ఆమె మాత్రం దీక్ష కు గైర్హాజరు అయ్యారు. అయితే జాతీయంగా రాహుల్ గాంధీ మహా కూటమి ఏర్పాటు చేస్తున్నప్పటి నుండి ఆ పార్టీకి దూరంగా ఉంటున్న దీదీ; వారు దీక్షకు హాజరవడం వలనే దూరంగా ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది.

ఇక మాయావతి, అఖిలేష్ కు కూడా అదే కారణంగా చెప్పుకురావటం విశేషం. ఇంతకీ వీరికి కాంగ్రెస్ తో సమస్య, లేదా టీడీపీ-కాంగ్రెస్ తో సమస్య అనేది స్పష్టంగా తేల్చకపోవటంతో అనేక వార్తలు హాల్ చల్ చేస్తున్నాయి. దీనిపై దీక్ష అనంతరం మీడియాతో మాట్లాడిన బాబును ప్రశించగా, నీళ్లునమిలడం విశేషం. దీనిని బట్టి ఈ అతిధులను మరోసారి చంద్రబాబు స్వయంగా కలిసి బుజ్జగించాల్సిన సందర్భం ఒకటి ఉన్నట్టే తెలుస్తుంది. బహుశా ఎన్నికలలోపు ఈ సర్దుబాట్లు జరిగిపోవచ్చు. అలా కాకుండా దూరంగానే ఉంటె మాత్రం చంద్రబాబు అన్నివిధాలా నష్టపోయినట్టే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరోవైపు కేసీఆర్ ఫ్రంట్ వైపు వీళ్ళు చూస్తున్నట్టు కూడా వార్తలు ఉన్నాయి. దానితో జాతీయంగా చక్రం తిప్పుదామని అనుకుంటున్న బాబు ఆశ నెరవేరకుండానే పోతుందా..!! కేసీఆర్ ఫ్రంట్ కూడా బీజేపీ వ్యూహమైతే.. బాబు కార్యాచరణ ఎలా ఉండబోతుంది?

Related posts