నేడు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 47వ జన్మదినం. లాక్ డౌన్ కారణంగా పుట్టినరోజును నిరాడంబరంగా ఇంట్లోనే జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా లాక్ డౌన్ అనుభవాలను సచిన్ అభిమానులతో పంచుకున్నాడు. ఇంట్లోనే ఉండడంతో వంట చేస్తున్నాను, చెట్లకు నీళ్లు పోస్తున్నాను, పిల్లలు సారా, అర్జున్‌తో ఎక్కువ సమయం గడుపుతున్నాను, లాక్‌డౌన్ వల్ల వారితో ఎక్కువ సేపు ఉండే వీలు కలుగుతోందని సచిన్ తెలిపారు.
పిల్లలు సారా, అర్జున్ తో గడిపేందుకు లాక్ డౌన్ కావాల్సినంత సమయాన్ని కల్పించిందన్నారు. నేను, నా భార్య అంజలి పిల్లలతో గడిపే అవకాశాన్ని లాక్ డౌన్ కల్పించిందని చెప్పారు. ఇదే విధంగా అమ్మతో కూడా ఎక్కువ సమయాన్ని గడుపుతున్నానని సచిన్ అన్నారు. సచిన్ టెండూల్కర్ ఇప్పటికే మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కు 50 లక్షలు అందజేశారు. పలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ 24 ఏళ్లపాటు టీమిండియాకు సేవలు అందించాడు.
అందుకే టీడీపీని ప్రజలు ఇంటికి పంపించారు: మంత్రి బొత్స