telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘నా ఫ్లాట్ ఈఎంఐ నేనే చెల్లిస్తున్నా… ఆధారాలు ఇవే…’ సుశాంత్ మాజీ ప్రేయసి అంకిత లోఖండే

Ankitha

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ నేపథ్యంలో సుశాంత్ మాజీ ప్రేయసి అంకిత లోఖండే ముంబైలోని మలాద్ ‌లో ఆమె నివసిస్తున్న ఫ్లాట్ ను సుశాంత్‌ నుంచి అక్రమంగా స్వాధీనం చేసుకున్నట్లు అంకితాపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేగాక ఈ విషయంపై రియా చక్రవర్తి… సుశాంత్‌ అంకిత కోసం ఈఎమ్‌ఐలు చెల్లించాడని, వారిద్దరూ విడిపోయిన తర్వాత కూడా అతడు అంకితను ప్లాట్‌ ఖాళీ చేయమని కోరలేదని రియా ఈడీకి తెలిపింది. అయితే ఈ విషయంపై అంకితా శనివారం ట్విటర్‌ ద్వారా స్పందించారు. తన ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కాగితాలతోపాటు ఆమె బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను పంచుకున్నారు. “నాపై వస్తున్న ఆరోపణలకు చెక్‌ పెడుతున్నాను. ఇవి నా ఫ్లాట్‌ రిజిస్ట్రేషన్‌ పత్రాలు. నా బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ వివరాలు. నా ఫ్లాట్‌ ఈఎమ్ఐలను నేనే చెల్లిస్తున్నాను. ఇంతకంటే ఇంకేం చెప్పలేను’ అని ట్వీట్‌ చేశారు. అయితే సుశాంత్‌ ఫ్లాట్‌ నెం 403ను కొనుగోలు చేశాడు. అలాగే అంకితా లోఖండే 404 ఫ్లాట్‌ కొన్నారు. సుశాంత్ తన ఫ్లాట్ ఈఎమ్‌ఐ చెల్లిస్తున్నట్లు, అంకిత తన ఇంటి ఈఎమ్‌ఐ చెల్లిస్తున్నట్లు ఆమె బ్యాంక్‌ స్టేట్‌మెంట్స్‌ ఆధారంగా తెలుస్తోంది.

Related posts