telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“రాములో రాములా” అంటూ స్టెప్పులేసి సుమ… !

Suma

అల్లుఅర్జున్‌ హీరోగా నటించిన “అల వైకుంఠపురం” సినిమాలోని పాటలు ఎంతలా పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా రాములో రాములా పాటకు ప్రముఖ యాంకర్‌ సుమా కనకాల కూడా ఇంట్లో స్టెప్పులేసింది. తోడుగా తన పెట్‌ కూడా ఉంది. మేకప్‌ లేకుండా మల్లెపూలు పెట్టుకొని పంజాబి డ్రెస్‌లో హ్యాపీగా చిందులేసింది. ఈ వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. ఎప్పుడూ ప్రోగ్రామ్స్‌, షో లతో బిజీగా ఉండే సుమా లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైంది. అయినా రిలాక్స్‌ అవ్వలేదు. కామెడి సిరీస్‌, వంటల వీడియోలను సోషల్‌మీడియాలో అప్‌లోడ్‌ చేస్తూ లైఫ్‌ను బిజీగా ఎంజాయ్‌ చేస్తున్నది. ఇటీవల సుమా ఆడపడుచు మరణించిన సంగతి తెలిసిందే. ఈ బాధ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. ఈ పాటకు క్రికెటర్‌ డెవిడ్‌ వార్నర్‌ తన భార్యతో కలిసి స్టెప్పులేసిన వీడియో సోషల్‌మీడియాలో బాగా వైరల్‌ అయింది.

Related posts