ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారి సామాన్యులు, సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులతో సహా ప్రతి ఒక్కరిని ఎటాక్ చేస్తుంది. తాజాగా సీనియర్ నటి, కర్ణాటక ఎంపీ సుమలత ఒకరు. అయితే ఆవిడకు ఈ నెల ప్రారంభం లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే సుమలత తన నియోజకవర్గంలో పర్యటించి ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించే సమయంలోనే ఆమెకు ఈ వైరస్ సోకింది అని అన్నారు. ఇక తాజాగా ఆవిడకు చేసిన కరోనా పరీక్షలో నెగెటివ్ వచ్చినట్లు కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పటివరకు కర్ణాటక లో 80 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1500 మందికి పైగా ఈ వైరస్ కారణంగా మరణించారు. ఇప్పటికే చాలా మంది రాజకీయ నాయకులు, సెలెబ్రిటీలు ఈ వైరస్ బారిన పడ్డారు.
previous post
next post