telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

క్యూఆర్‌ కోడ్‌లను స్కాన్‌ చేయవద్దు : ఖాతాదారులకు ఎస్బీఐ హెచ్చరికలు

రోజు రోజుకు సైబర్ నెరగాళ్ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి. సైబర్ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో.. స్కాంల బారిన కస్టమర్లు పడకుండా ఎస్బిఐ తమ వినియోగదారులను హెచ్చరిస్తోంది. క్యూ ఆర్ కోడ్ లను స్కాన్ చేయకూడదని విజ్ఞప్తి చేసింది. క్యూ ఆర్ కోడ్ లను వినియోగించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేసింది ఎస్‌బీఐ. రాత్రి వేళల్లో ఆన్ లైన్ లో నగదు లావాదేవీలను నిర్వహిచాల్సిన పరిస్థితిలో మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. లేనిపక్షంలో బ్యాంకు ఖాతాలో డబ్బులను.. సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం పొంచి ఉందని తెలిపింది.

Related posts