telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చిరుకు చెల్లిగా సాయిపల్లవి

saipallavi said no to another add chance

ఫిదా సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది సాయి పల్లవి. ఆ తర్వాత విడుదలైన ఎంసిఏ కూడా హిట్ కావడంతో స్టార్ అయిపోయింది. అయితే ఆ తర్వాత వచ్చిన కణం, పడిపడి లేచే మనసు, ఎన్జీకే, మారి 2 లాంటి సినిమాలు ఫ్లాప్ అయినా అమ్మడు క్రేజ్ మాత్రం తగ్గలేదు. గ్లామర్ షో విషయంలో స్క్రిప్ట్ డిమాండ్ చేసినా హాట్ సన్నివేశాలకు దూరంగా ఉంటుంది. ప్రస్తుతం విరాటపర్వం, లవ్‌ స్టోరీ చిత్రాలతో బిజీగా ఉంది. ఇక ఈ భామ హామిళంలోను అటు మలయాళం లోను సినిమాలు చేస్తుంది. అయితే ఈ మధ్య అమ్మడికి తమిళనాట నుంచి ఆఫర్లు రావడంలేదని వినిపిస్తుంది. తాజాగా ఈ బ్యూటీకి బంపర్ ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది. చిరంజీవి హీరోగా తమిళ సూపర్ హిట్ ‘వేదలమ్’ ను రీమేక్ చేయబోతున్నారు. అందుకు సంబంధించి మెహర్ రమేష్ దాదాపుగా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశాడు. “ఆచార్య” పూర్తి కాగానే రీమేక్ ను షురు చేయాలని భావిస్తున్నాడు. ఇలాంటి సమయంలో సాయి పల్లవిని హీరోయిన్ పాత్రకు గాను సంప్రదించడం జరిగిందని తెలుస్తుంది. ఈ సినిమాలో మెగాస్టార్ చెల్లెలిగా సాయిపల్లవిని ఎంపిక చేసే యోచనలో ఉన్నారట చిత్రయూనిట్. ”వేదలమ్ ” సినిమాలో అజిత్ చెల్లి క్యారెక్టర్ కూడా చాలా కీలకంగా ఉంటుంది. మరి ఈ ఆఫర్ కు సాయిపల్లవి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాల్సిందే.

Related posts