telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వ్యాపారవేత్తకు జోడిగా హన్సిక ?

Saravana

చెన్నైలో శరవణ స్టోర్స్ అధినేతగా శరవణన్ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఆయన సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. త్వరలో శరవణన్ హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. చెన్నై టీ.నగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో శరవణ స్టోర్స్ శాఖలు నిర్వహిస్తోంది. శరవణా స్టోర్స్‌కి సంబంధించిన యాడ్స్‌లో దాని అధిపతి శరవణన్ స్వయంగా నటిస్తున్నారు. ఇటీవల తమన్నా, హన్సికతో కలిసి రూపొందించిన ఓ యాడ్‌లోనూ శరవణన్ దర్శనమిచ్చాడు. ఈ విషయంలో సోషల్ మీడియా వేదికగా శరవణన్ పై గతంలోనూ పలు విమర్శలు వచ్చినా అతను పెద్దగా పట్టించుకోలేదు. ఇక శరవణన్ నటించబోయే సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించబోతోందంటూ వార్తలు విన్పించాయి. కానీ నయనతార వాటిని కొట్టిపారేసింది. తాజాగా శరవణన్ తో తమిళ స్టార్ హీరోయిన్ హన్సిక జతకట్టబోతోంది అంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలపై హన్సిక స్పందించింది. తాను శరవణన్ సరసన నటించనున్నట్లు మీడియాలో వస్తున్న కథనాల్లో నిజం లేదని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది. ఇక శరవణన్ సినిమాకు సంబంధించిన ప్రీ పొడక్షన్ పనులు పూర్తయినట్లు కోలీవుడ్ మీడియా వర్గాల్లో వినికిడి.

Related posts