telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

స్వాతంత్ర్య సమర యోధుల లుక్ లో బన్నీ పిల్లలు… పిక్స్ వైరల్

AA

దేశవ్యాప్తంగా ఈరోజు 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పలువురు సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అందులో భాగంగా అల్లు అర్జున్ కుమారుడు అయాన్, కూతురు అర్హ‌ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయాన్, అర్హ ఇద్దారూ స్వాతంత్ర్య సమర యోధుల వేషధారణలు ధరించి నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ‘సైరా’ నరసింహారెడ్డి లుక్ లో అయాన్, మదన్ మోహన్ మాలవియా దుస్తుల్లో అర్హ ఆకట్టుకుంటున్నారు. ఆ ఫొటోలను అల్లు అర్జున్‌తో పాటు స్నేహ తమ సామాజిక మాధ్యమాల ఖాతాల్లో పోస్టు చేశారు. ఈ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Related posts