ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ చాలా సంతృప్తికరంగా, ఆనందంగా జరిగిందని చిరంజీవి అన్నారు. ఈ పండుగ పూట ఒక సోదరుడుగా నన్ను ఆహ్వానించి విందు భోజనం పెట్టడం సంతోషంగా ఉందన్నారు.సీఎంతో సమావేశం ముగిసిన తర్వాత గన్నవరం ఎయిర్ పోర్టులో చిరంజీవి మీడియాతో ముచ్చటించారు.వారం, 10 రోజుల్లో ఏపీ ప్రభుత్వం నుంచి కొత్త జీవో వస్తుంది ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక గత కొన్ని నెలలుగా నడుస్తున్న విషయంపై ఎంతో మీమాంస ఏర్పడింది. జటిలమైన ఈ సమస్యను ఒక కొలిక్కి తీసుకురావడానికి జగన్ గారు నన్నుఆహ్వానించారు. ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందు ఒక సైడ్ మాత్రమే కాదు రెండు సైడ్లు వినాలని, మీరు వస్తే ఒక విధివిదానాన్ని తయారుచేసి .. తుది నిర్ణయం తీసుకోవాలని ఆయన నన్ను కోరడం ఎంతో భాద్యతగా అనిపించింది.
పైకి కన్పించినంత గ్లామర్ గా సినీ ఫీల్డ్ ఉండదు. రెక్కాడితే కాని డొక్కాడని పేదలు ఇండస్ట్రీని నమ్ముకుని ఉన్నారు. ధియేటర్ల యజమానులకూ అనేక బాధలు ఉన్నాయి. హాళ్లని మూసేస్తేనే బెటర్ అనే భావనకు కొందరు ధియేటర్ యజమానులు ఉన్నారు. ఈ సమస్యలన్నీ సీఎంకు వివరించాను. అన్ని రకాలుగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటామని జగన్ చెప్పారు. టిక్కెట్ ధరలపై జారీ చేసిన జీవోను జగన్ పునః పరిశీలిస్తామన్నారు.
సామాన్యులకు వినోదం అందుబాటులో ఉండాలని ప్రభుత్వం తీసుకొన్న చర్యలు అభినందనీయమని చిరంజీవి అన్నారు. థియేటర్ల వాళ్ళు పడుతున్న భాదలు గురించి అన్ని తెలుపడం జరిగింది అని, ఆయన వెంటనే సానుకూలంగాస్పందించి తాను చెప్పిన విషయాలను సీఎం జగన్ నోట్ చేసుకొన్నారని తెలిపారు.
ఈ విషయాలను అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీకి అందించి డ్రాఫ్ట్ తయారు చేయించి సినీ పరిశ్రమకు అందిస్తామన్నారు. సినీ పరిశ్రమ వర్గాలు సంతృప్తి చెందితే కొత్త జీవో జారీ చేస్తామని సీఎం జగన్ తమకు హామీ ఇచ్చారన్నారు. నేను నమ్మకంగా చెప్తున్నా ఆయన మాటలు ఒక ధైర్యాన్ని ఇచ్చాయి. ఏదో మంచి చేయాలన్న ఆలోచన ప్రభుత్వం వైపు నుంచి ఉంది.
నేను ఒక పక్షాన ఉండను, అందరినీ సమదృష్టితో చూస్తానని, భయపడొద్దని భరోసా ఇచ్చారు. త్వరలోనే ఒక మంచి నిర్ణయంతో వస్తామని చెప్పారు. అందరికి ఆమోద యోగ్యం అయితే దాన్ని జీవో గా తీసుకొందామని చెప్పారు. అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటానన్నారు.ఈ వారం పదిరోజుల్లో లేదా నెలలో కొత్త జీవో వస్తుంది.
ఈ చిత్రపరిశ్రమ పెద్దగా కాకుండా బిడ్డంగా చెబుతున్నా.. ఎవరూ ఆందోళన చెందొద్దు. అందరూ సంయమనంతో ఉండాలి..ఎలాంటి ఆవేశాలకు లోనై స్టెట్‌మెంట్ ఇవ్వటం కానీ మాటలు చారడం చేయొద్దని కోరుతున్నా. త్వరలోనే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నా’అన్నారు.
అంతేకాకుండా ఈ సమావేశం వివరాలను సినీ ఇండస్ట్రీలోని చిన్నా పెద్దలకు కూడా తెలియజేస్తాను. ఆ తర్వాత మరోసారి సీఎం జగన్ తో భేటీ అవుతా. వచ్చే సమావేశానికి అందర్నీ పిలిస్తే అందరం వస్తాం.. నన్నొక్కడినే పిలిస్తే నేనొక్కడినే వస్తానని తెలిపారు..
ఇక ఆ పాత్ర చేయలేను : చిరంజీవి