telugu navyamedia
సినిమా వార్తలు

‘సీటిమార్‌’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

హీరో గోపీచంద్‌ నటిస్తున్న స్పోర్ట్స్‌ డ్రామాలో ‘సీటిమార్‌’. సంపత్‌ నంది డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో గోపీచంద్‌ కబడ్డీ కోచ్‌గా కనిపించనున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం సోమవారం అధికారికంగా ప్రకటించింది. ‘గౌతమ్‌నంద’ తర్వాత సంపత్‌నంది-గోపీచంద్‌ కాంబినేషన్‌లో వస్తోన్న రెండో చిత్రమిది.

ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా జ్వాలారెడ్డి పాత్ర పోషించారు. దిగంగనా సూర్యవంశీ, భూమిక, రావురమేశ్‌, పోసాని కృష్ణ మురళీ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది. మణిశర్మ సంగీతం అందించారు. కాగా ఈ సినిమా నుండి విడుదలైన టీజర్‌, సాంగ్స్‌ ఆకట్టుకున్నాయి.

Related posts