telugu navyamedia
సినిమా వార్తలు

1,000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకున్న నాగార్జున

అక్కినేని నాగార్జున తెలంగాణ‌లో 1,000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ను దత్తత తీసుకున్నారు. ఈ రోజు సీఎం కేసీఆర్ జ‌న్మ‌దినోత్స‌వం సంద‌ర్భంగా, గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మేడ్చ‌ల్ జిల్లా చెంగిచెర్ల‌లో అడ‌విని నాగార్జున‌ దత్త‌త తీసుకున్నారు.

తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 లో.. ఓ ఎపిసోడ్ లో నాగార్జున 1000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ను దత్తత తీసుకుంటానని ఎంపి సంతోష్ కుమార్ కు మాట ఇచ్చారు…ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్నారు.

అలాగే హైదరాబాద్ శివారులోని చెంగిచర్ల అటవీ బ్లాక్ పరిధిలో తన తండ్రి, దివంగత ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వర రావు పేరు మీద అర్బన్ ఫారెస్ట్ పార్కుగా ఏర్పాటు చేయనున్నారు. ఈరోజు ఎం.పీ జోగినపల్లి సంతోష్ కుమార్‏తో కలిసి చెంగిచర్లలోని శంకుస్థాపన కార్యక్రమంలో నాగార్జున కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.

Akkineni Nagarjuna adopts 1,000 acre forest block

అక్కినేని నాగార్జున, అమల, కుమారులు నాగ చైతన్య, నిఖిల్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అటవీ పార్కు అభివృద్దికి ముఖ్యమంత్రి సంకల్పించిన హరిత నిధి (గ్రీన్ ఫండ్) ద్వారా రూ. 2 కోట్ల చెక్కును అటవీ శాఖ ఉన్నతాధికారులకు అందించారు.

మన పరిసరాలు, రాష్ట్రం, దేశం కూడా ఆకుపచ్చగా, పర్యావరణ హితంగా మారాలన్న సంకల్పంతో, తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించారని, ఈ కార్యక్రమంలో తాను స్వయంగా పాల్గొని పలు సార్లు మొక్కలు నాటానాని నాగార్జున తెలిపారు.

Nagarjuna 44

గత బిగ్ బాస్ సీజన్ ఫైనల్ కార్యక్రమం సందర్భంగా అడవి దత్తతపై సంతోష్‌తో చర్చించానని, ఆ రోజు వేదికపై ప్రకటించినట్లు గానే ఇప్పుడు అటవీ పునరుద్దరణ, అర్బన్ ఫారెస్ట్ పార్కు ఏర్పాటుకు శంకుస్థాపన చేయటం ఆనందంగా ఉందని నాగార్జున అన్నారు. ఈ అటవీ ప్రాంతం చుట్టూ ఉన్న పట్టణ ప్రాంత కాలనీ వాసులకు పార్కు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.

Related posts