telugu navyamedia
తెలంగాణ వార్తలు

రేవంత్​ రెడ్డి అరెస్టు: కేసీఆర్ జన్మదినం…ప్రతిపక్ష నేతల జైలుదినం కావాలా?

*కేసీఆర్ జన్మదినం…ప్రతిపక్ష నేతల జైలుదినం కావాలా?

*నిరుద్యోగుల తరపున ప్రశ్నించడమే మేం చేసిన నేరమా?

*ఉద్యోగాల భర్తీకి మెగా నోటిఫికేషన్ డిమాండ్ చేస్తూ అన్నీ మండల కేంద్రాల్లో
కేసీఆర్ దిష్ఠిబొమ్మను దగ్ధం చేయాలని రేవంత్ రెడ్డి పిలుపు

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైదరాబాద్​లో మరోసారి పోలీసులు అరెస్ట్ చేశారు. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు తెలపాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. దీంతో జూబ్లీహిల్స్​లోని ఆయ‌న నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకుని గోల్కొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు

పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ బర్త్‌డే.. ప్రతిపక్షాలకు జైలు డే ..కేసీఆర్ జన్మదినం.. ప్రతిపక్షాలకు జైలు దినం కావాలా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. జన్మదినం సందర్భంగా ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయించి.. కేటీఆర్ తన తండ్రికి కానుక‌గా ఇవ్వదలచుకున్నారా అని అన్నారు. నిరుద్యోగుల ఆవేదనకు సమాధానం చెప్పకుండా ఉత్సవాలు ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ జన్మదినం.. నిరుద్యోగుల కర్మ దినంగా మారిందని వాపోయారు.

‘కేసీఆర్ తన నీడకు కూడా భయపడతాడు. కేసీఆర్ తన పుట్టినరోజు జరుపుకునేందుకు వీలుగా వరుసగా రెండో రోజు కూడా నన్ను అరెస్ట్ చేశారు. ఓవైపు నిరుద్యోగ యువత ప్రాణాలు తీసుకుంటుంటే.. పుట్టినరోజులు జరుపుకోవడానికి ఇదేనా సమయం అంటూ ప్ర‌శ్నించారు.

కేసీఆర్ జన్మదిన ఉత్సవాలను వ్యతిరేకిస్తూ.. కాంగ్రెస్ శ్రేణులు, నిరుద్యోగులందరూ మెగా నోటిఫికేషన్ ను డిమాండ్ చేస్తూ మండల కేంద్రాల్లో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

దీంతో రేవంత్‌ను అరెస్ట్ చేసి మొదట లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్‌ వైపు తీసుకెళ్లిన పోలీసులు అక్కణ్నుంచి గోల్కొండ పీఎస్‌కు తరలించారు. గోల్కొండ పీఏస్ వెళ్లే దారులన్నీ మూసేశారు. పీఏస్‌కు కిలోమీటర్ దూరం నుంచి భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

అంతకుముందు, కేసీఆర్ పుట్టినరోజుపై రేవంత్ రెడ్డి ట్విట్టర్‌లో వ్యంగ్యంగా స్పందించారు. ఊసరవెల్లి ఫోటో పెట్టి పుట్టిన రోజు శుభాకాంక్షలు అని పోస్టు చేశారు రేవంత్​. సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ రేవంత్ చేసిన ఈ ట్వీట్‌పై టీఆర్ఎస్ మద్దతుదారులు విమర్శలు గుప్పిస్తున్నారు.

Related posts