telugu navyamedia
క్రైమ్ వార్తలు

కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఫ్యాక్ట‌రీలో ప్ర‌మాదం..

*పుట్ట‌గొడుగులు ఫ్యాక్ట‌రీలో అదుపులోకి రాని మంట‌లు..
*ఉపాధి కోసం క‌ల‌క‌త్తా నుంచి వ‌చ్చిన బాలిక కుటుంబం..
*ఐదేళ్ళ పాప కోసం గాలిస్తున్న రెస్య్కూఆప‌రేష‌న్‌
*క‌న్నీరు మున్నీరుగా విల‌పిస్తున్న బాలిక కుటుంబం..

కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు మండలం కాల్వ గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓర్వకల్లులో పుట్టగొడుగుల ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ఐదేళ్ల పాప చిక్కుకుంది.

నిన్న‌టి నుంచి మంట‌లు అదుపులోకి రావ‌డం లేదు. ములిరా ముల్ల అనే ఐదేళ్ళ పాప ఆచూకీ కనిపించకపోవడంతో నిన్నటి నుంచి తల్లిదండ్రుల పడుతున్న ఆవేదన అంతా ఇంతా కాదు.

కోల్‌కతాకు చెందిన పరోలి బిబి, శారదా ముల్లా దంపతులు తమ కూతురు తో కలిసి బతుకుదెరువు కోసం కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వ గ్రామంలో ఉన్న పుట్టగొడుగుల ఫ్యాక్టరీకి వచ్చారు. వివిధ రాష్ట్రాలకు చెందిన అయిదు వందల మంది వరకు కూలీలు ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. పుట్టగొడుగుల పెంపకానికి ఉపయోగించే గుట్టలుగా పోసిన 2,000 టన్నుల వరకు వరి గడ్డి పూర్తిగా దగ్ధమైంది. మంటలు ఆర్పేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఫైరింజన్లు తీసుకువచ్చారు. అందరూ సేఫ్ గా ఉన్నప్పటికీ ఐదేళ్ళ పాప కనిపించకపోవడం లేదు.

దాంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పాప ఫోటో చూసుకుంటూ బాధిత తల్లిదండ్రులు రోదిస్తున్నారు.బాలిక ఆచూకీ కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.

Related posts