telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తలైవి : జయలలితగా కంగనా… పిక్స్ వైరల్

Thalaivi

కంగ‌నా రనౌత్ ప్ర‌ధాన పాత్ర‌లో ఏఎల్ విజ‌య్ తెర‌కెక్కిస్తున్న “త‌లైవీ” చిత్రం. విజయేంద్ర ప్రసాద్ కథ రాశారు. ‘తలైవి’ బయోపిక్‌ను విష్ణు ఇందూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీలో సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో అర‌వింద‌స్వామి దివంగ‌త త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి, లెజెండరీ యాక్టర్‌ ఎంజీ రామ‌చంద్రన్ (ఎంజీఆర్‌) పాత్రలో న‌టిస్తున్నారు. అలాగే మ‌రో లెజెండ్రీ పొలిటీషియ‌న్, దివంగ‌త మాజీ ముఖ్యమంత్రి క‌రుణానిధి పాత్రలో విల‌క్షణ న‌టుడు ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు. బ్లేడ్ ర‌న్నర్‌, కెప్టెన్ మార్వెల్ వంటి హాలీవుడ్ చిత్రాల్లో వ‌ర్క్ చేసిన ప్రముఖ హాలీవుడ్ మేక‌ప్ ఆర్టిస్ట్ కంగ‌నా ర‌నౌత్‌ను జ‌య‌ల‌లిత‌గా చూపిస్తున్నారు. దర్శకుడు విజయ్ శోభన్ బాబు పాత్రకు ప్రముఖ బెంగాలీ నటుడు జిషు సేన్‌గుప్తాను ఎంపిక చేసారు. ఇక లాక్ డౌన్ కారణముగా దాదాపు ఆరు నెలలు షూటింగ్ కు దూరమైన కంగనా తాజాగా షూటింగ్ స్పాట్ లోకి అడుగు పెట్టింది. ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఆ సినిమా యూనిట్ షూటింగు పనులు కొనసాగిస్తోంది. ఈ సినిమా షూటింగులో తీసుకున్న కొన్ని ఫొటోలను ఆమె ఇటీవల తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. తాజాగా, మరిన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది. జయలలితలా చీర కట్టుకొని, నుదుటిన బొట్టు పెట్టుకుని సంప్రదాయబద్ధంగా ఆమె కనపడుతోంది. హైదరాబాద్‌లో ఇటీవల షెడ్యూల్‌ పూర్తి చేసుకుని తన స్వస్థలం మనాలికి ఆమె తిరిగివెళ్లారు.

Related posts