telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వర్మ “క్లైమాక్స్” రేటు ఫిక్స్

climax

సంచనల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘క్లైమాక్స్’ రూపంలో మరో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఈ మూవీ పోస్టర్స్, టీజర్ ద్వారా అలజడి సృష్టించిన ఆయన.. ఇక ఈ మూవీ ట్రైలర్, రిలీజ్ డేట్, సినిమా చూడటానికి కావాల్సిన సొమ్ము ఎంతో చెబుతూ ట్వీట్ చేశారు. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేస్తూ అందులో ఈ వివరాలన్నీ పొందుపర్చారు. గతంలోనే ‘క్లైమాక్స్’ సినిమాను ఓటీటీ వేదికపై RGVWorldTheatreలో మే 29వ ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తా అని ప్రకటించిన వర్మ.. బ్రేకింగ్ న్యూస్ అంటూ మరో డేట్‌ని అఫీషియల్‌గా ప్రకటించాడు. ”మియా మాల్కోవా ‘క్లైమాక్స్’ మూవీ జూన్ 6వ తేదీన రాత్రి 9 గంటలకు విడుదల కానుంది. ఈ మూవీని RGVWorld.in/ShreyasET వేదికపై చూడొచ్చు. పే ఫర్ వ్యూ మోడల్‌లో ఈ సినిమాను మీ ముందుకు తెస్తున్నా. ఒక్కో వ్యూ కోసం 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన లాగిన్ వివరాలు త్వరలోనే ప్రకటిస్తా. ఇక ఈ మూవీ నుంచి మరో ట్రైలర్ రేపు (మే 30) సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయబోతున్నా. గెట్ రెడీ” అంటూ ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. ఆయన పెట్టిన ఈ ట్వీట్‌పై ఫన్నీ మీమ్స్‌తో మిశ్రమంగా స్పందిస్తున్నారు నెటిజన్స్.

Related posts