telugu navyamedia
క్రీడలు వార్తలు

మరోసారి బీసీసీఐని నిందిస్తున్న ఆసీస్ మాజీలు…

సమయం దొరికినప్పుడల్ల ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు బీసీసీఐ ని విమర్శిస్తూనే ఉంటారు. ఈ ఏడాది ఆసీస్ వేదికగా జరగాల్సిన ఐసీసీ ప్రపంచ కప్ కరోనా కారణంగా వాయిదా పడింది. ఆ సమయంలో యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 ని నిర్వహిస్తుంది బీసీసీఐ. దాంతో అప్పటినుండే బీసీసీఐని టార్గెట్ చేయడం ప్రారంభించారు ఆసీస్ మాజీలు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ పూర్తయిన తర్వాత నవంబర్ చివర్లో టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు ఆసీస్ పర్యటనకు వెళ్లనుంది. డిసెంబర్ 3 న ఆసీస్ తో భారత టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది. ఇక ఇదే క్రమంలో జనవరి 3న ఆసీస్ న్యూ ఇయర్ టెస్ట్ మ్యాచ్ భారత్ తో ఆడుతుంది. కానీ ఈ మ్యాచ్ ను జనవరి 7కు వాయిదా వేయాల్సిందిగా బీసీసీఐ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డును కోరింది. అయితే ఇదే విషయం ఇప్పుడు ఆసీస్ మాజీలకు నచ్చడం లేదు. ఇప్పటికే బీసీసీఐ పై ఆగ్రహంగా ఉన్న వారికి బీసీసీఐ ని విమర్శించడానికి మరో అవకాశం దొరికినట్లు అయ్యింది. మేము ఎప్పటినుండో సంప్రదాయంగా నిర్వహిస్తూ వస్తున్న ఈ  న్యూ ఇయర్ టెస్ట్ ను వాయిదా వేయమనడం సరికాదు. ఈ విషయం లో బీసీసీఐ మైండ్ గేమ్ ఆడుతుంది అని ఆసీస్ మాజీలు ఆరోపిస్తున్నారు. మరి బీసీసీఐ విజ్ఞప్తికి ఆసీస్ బిరుదు ఏ విధంగా సమాధానం ఇస్తుంది అనేది చూడాలి.

Related posts