telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఆ దుర్ఘటనకు నేటితో 19 ఏళ్ళు…

2001 డిసెంబర్ 13 న ఇండియన్ పార్లమెంట్ పై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులు చేశారు. అయితే ఈ దుర్ఘటనకు నేటితో సరిగ్గా 19 సంవత్సరాలు. అక్కడ ఉన్న సెక్యూరిటీని దాటుకొని పార్లమెంట్ ఆవరణలోకి ప్రవేశించిన ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించారు.  ఉగ్రవాదుల దాడిలో 9 మంది భద్రతా సిబ్బంది మరణించారు. సీఆర్పీఎఫ్, ఢిల్లీ పోలీస్, సిఫై డబ్యూడి శాఖలకు చెందిన సిబ్బంది విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ దాడులు జరిగాయి.  ఈ దాడుల్లో కమలేష్ కుమారి, నానక్ చంద్, రామ్ పాల్, ఓం ప్రకాష్, విజయేందర్ సింగ్, ఘనశ్యామ్ సింగ్, ఎంఎస్ నేగి, జేపీ యాదవ్, విక్రమ్ , బసంత్ తదితరులు అమరులయ్యారు. పార్లమెంట్ పై జరిగిన దాడి తరువాత భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది ప్రభుత్వం. పార్లమెంట్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు దేశం ఘననివాళిని అర్పించింది. దాంతో ప్రస్తుతం పార్లమెంట్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతుంది. అయితే నటి నుండి నేటి వరకు పాక్ భారత బోర్డర్ లలో విధ్వంసం చేస్తూనే ఉన్నారు. వారికీ తగ్గిన సమాధానం మన సైనికులు చెబుతూనే ఉన్నారు.

Related posts