ప్రజల నుంచి సేకరించిన విరాళాలతోనే అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలని తలపెట్టారు. అయితే, విరాళాల సేకరణపై నిన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు.. అయోధ్య రామాలయానికి విరాళాలు ఇవ్వొద్దంటూ పిలుపునిచ్చారాయన.. ఉత్తరప్రదేశ్ రాముడు మనకెందుకు.. మన దగ్గర రాముడి ఆలయాలు లేవా? అంటూ ప్రశ్నించిన కోరుట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. కొత్త వివాదానికి తెరలేపారు. అంతేకాదు.. బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు విద్యాసాగర్‌రావు.. రాముని పేరు మీద భిక్షం ఎత్తుకుంటున్నారని, దీంతో.. కొత్త నాటాకనికి తెర లేపుతున్నారంటూ ఘాటుగా స్పందించారు. అయితే… విద్యాసాగర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆందోళన చేసింది. ఈ నేపథ్యంలో అయోధ్య రాముడిపై చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే తనను క్షమించాలని.. తన వ్యాఖ్యలను కొంతమంది వక్రీకరించారని విద్యాసాగర్ పేర్కొన్నారు. తానూ రాముడి భక్తుడినేనని…అయోధ్య రాముడి ఆలయ నిర్మాణానికి విరాళాలూ ఇస్తానని వెల్లడించారు.
previous post
next post
రాజధానిగా అమరావతినే కొనసాగించాలి: పత్తిపాటి పుల్లారావు డిమాండ్