telugu navyamedia
క్రీడలు వార్తలు

ఈ ఏడాది చెన్నై జట్టులో రైనానే కీలకం…

చెన్నై సూపర్‌ కింగ్స్ సురేశ్‌ రైనా విఫలమైతే.. వారి విజయావకాశాలు మరింత దెబ్బతింటాయని టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత‌ ఆకాశ్‌ చోప్రా అన్నారు. ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ ఐపీఎల్ 2021 మ్యాచ్‌లు జరగనున్న విషయం తెలిసిందే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఏప్రిల్ 9న ముంబై ఇండియన్స్ ఢీ కొట్టబోతోంది. అయితే చెన్నై జట్టు పై ఆకాష్ మాట్లాడుతూ… ‘సురేశ్‌ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్‌ ధోనీ వంటి క్రికెటర్లు అంతర్జాతీయ లేదా పోటీ క్రికెట్‌ గతకొంత కాలంగా ఆడటం లేదు. గాయం కారణంగా కొన్నాళ్లుగా రవీంద్ర జడేజా టీమిండియాకు దూరమయ్యాడు. అంటే ఏడుగురు అత్యుత్తమ ఆటగాళ్లలో నలుగురు ఫామ్‌లో లేరు లేదా పోటీ క్రికెట్‌ ఆడలేదు. ఇదే చెన్నై జట్టు ప్రధాన లోపం’ అని అన్నారు. అయితే రాబిన్‌ ఉతప్ప, రుతురాజ్‌ గైక్వాడ్‌ రాణించేందుకు అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వారు దేశవాళీ క్రికెట్‌ ఆడారు. మంచి గణాంకాలు సాధించారు. ఫాఫ్ డుప్లెసిస్‌ సైతం ఫామ్‌లోనే ఉన్నాడు. కానీ మిగిలిన నలుగురికి భారీ షాట్లు ఆడటం, పరుగెత్తడం వారికి సవాల్‌గా మారతాయి. అని చోప్రా‌ పేర్కొన్నారు.

Related posts