telugu navyamedia
రాజకీయ వార్తలు

భారత మాజీ ప్రధానికి కరోనా పాజిటివ్…

మన దేశంలో ఈ ఏడాది ఆరంభం నుండి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే వ్యాక్సిన్ వచ్చిన తర్వాత అందరూ క్రేజులు తగ్గుతాయి అనుకున్నారు. కానీ ఇప్పుడు దేశంలో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి.  కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు.  మహారాష్ట్రలో లాక్ డౌన్ ను విధించాలని డిమాండ్ పెరుగుతున్నది.  అయితే, మంత్రులు, ప్రతిపక్షాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి.  ఇక ఈ కరోనా సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు ఎవర్ని వదలడం లేదు.  తాజాగా, జేడీఎస్ నేత, మాజీ ప్రధాని దేవెగౌడ కరోనా బారిన పడ్డారు.  తనకు తన భార్య చెన్నమ్మకు కరోనా వైరస్ సోకినట్టు దేవెగౌడ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.  ప్రస్తుతం తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఐసోలేషన్ లో ఉన్నట్టు తెలిపారు.  తమను కలిసిన వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలని, కరోనా వైద్యపరీక్షలు చేయించుకోవాలని కోరారు. అయితే చూడాలి మరి ఈయన ఇప్పటివరకు కోలుకుంటాడు అనేది.

Related posts