telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

కొత్త ఏడాది నుండి టోల్ గేట్స్ దగ్గర కీలక మార్పులు…

Toll gate National highway

2021లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి.. జనవరి 1 నుంచే అవి అవి అమల్లోకి రానున్నాయి.. న్యూఇయర్ మొదటి రోజు నుంచే చాలా మార్పులు రాబోతున్నాయి.. ఇప్పటివరకు హైవేలపై దూసుకుపోయాం.. టోల్ గేట్ దగ్గర క్యాష్ కట్టేసి వెళ్లిపోయేవాళ్లం.. కానీ, ఇకముందు అలాంటి అవకాశం లేదు.. టోల్గేట్ దగ్గర డబ్బులిస్తే తీసుకోరు. నో క్యాష్.. అలాగని కార్డు పేమెంట్ కు కూడా అవకాశం లేదు.. టోల్ ప్లాజా గేటు తెరుచుకోవాలంటే మన దగ్గర ఒక ఆయుధం ఉండాలి.. అదే ఫాస్టాగ్. ఫాస్టాగ్ అంటే ఏమీలేదండి… కారు రిజిస్ట్రేషన్ నంబర్, బ్యాంక్ ఎకౌంట్ ని అనుసంధానం చేసి ఆ వివరాలకు సంబంధించిన స్టిక్కర్‌ ని కారు విండ్ స్క్రీన్ పై అతికిస్తారు. దానిని, టోల్ గేట్ దగ్గరకు వెళ్లగానే స్కానర్లు ఎకౌంట్ లో డబ్బుల్ని ఆటోమేటిగ్గా తీసేసుకుంటాయన్నమాట. ఇదంతా క్షణాల్లోనే జరుగుతుంది. సో, కారు టోల్ గేట్ దగ్గర ఎక్కువసేపు ఆగే పరిస్థితి ఉండదు. భారీ క్యూలకు చెక్ పడుతుంది. ఫ్యూయల్ కూడా ఆదా అవుతుంది.  జనవరి 1 తర్వాత అన్ని ఫోర్ వీలర్లకు ఫాస్టాగ్ కచ్చితంగా ఉండాల్సిందనని కేంద్రం ఇప్పటికే ఆదేశాలిచ్చేసింది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts