భారత టెస్టు జట్టులో కీలకమైన ఆటగాడు ఎవరు అంటే చాలా మంది చెప్పే పేరు చతేశ్వర్ పుజారా. అయితే ఇప్పుడు ఈ టెస్ట్ స్పెషలిస్ట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడేందుకు పుజారా సన్నద్ధం అవుతున్నాడు. ఈసారి వేలంలో పుజారాను రూ. 50 లక్షల కనీస ధరకు సీఎస్‌కే దక్కించుకుంది. అయితే తన ఐపీఎల్ రీఎంట్రీ పై తాజాగా చతేశ్వర్ పుజారా క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ… ‘2016, 2017 సీజన్లలో పాల్గొన్న గుజరాత్ లయన్స్ నన్ను తీసుకోలేకపోవడం ఎంతో బాధించింది. నా హోమ్ టౌన్ లో ఆడాలనే కోరిక ఉండేది. గుజరాత్ లయన్స్ నన్ను కచ్చితంగా తీసుకుంటుందని ఆశించా. రెండు సీజన్ల వేలంలో కొనుగోలు చేయకపోవడం చాలా నిరాశపరిచింది. ఒకవేళ అప్పుడు వారు నన్ను తీసుకుని హోమ్ టౌన్‌లో ఆడే అవకాశాన్ని ఇచ్చి ఉంటే బాగుండేది. ఏదేమైనా అదంతా గతం. ప్రస్తుతం ఏమి చేయాలనే దానిపై దృష్టిపెట్టా’ అని తెలిపాడు. అయితే చివరిసారిగా ఐపీఎల్ లో 2014 లో ఆడిన పుజారా ఇప్పుడు మళ్ళీ ఆడనున్నాడు.
previous post
next post