telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

బంగారం కొనేవారికి షాక్‌… భారీగా పెరిగిన ధరలు

బులియన్‌ మార్కెట్‌లో రెండు రోజులుగా తగ్గిన బంగారం ధరలు తాజాగా మళ్లీ పెరిగాయి. అటు ఢిల్లీ, ఇటు హైదరాబాద్‌లోనూ బంగారం ధరలు బాగా పెరిగి పోయాయి. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం రూ. 270 తగ్గి రూ. 47,180 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 తగ్గి రూ. 43,250 వద్ద ఉంది. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగి పోయాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 600 పెరిగి రూ. 45,440 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 550 పెరిగి రూ. 41,650 పలుకుతోంది. బంగారం ధర బాటలోనే.. వెండి ధరలు కూడా భారీగానే పెరిగాయి. కిలో వెండి ధర రూ. 1400 పెరిగి రూ. 68,700 వద్ద కొనసాగుతోంది.

Related posts