telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఆధార్-పాన్ లింక్ .. గడువు పొడిగించిన ప్రభుత్వం..

pan adhaar link

పాన్ కార్డుతో ఆధార్‌ అనుసంధానం గడువు రేపటితో ముగిసిపోతుండగా, కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆ గడువును మరింత పొడిగించింది. డిసెంబరు 31 వరకు ఉన్న డెడ్‌లైన్‌ను మార్చి 31కి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) ప్రకటన విడుదల చేసింది. పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసే గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలిపిన విషయం తెలిసిందే. డిసెంబరు 31 లోగా పాన్‌ను ఆధార్‌తో జత చేసుకోవాలని, లేకపోతే పాన్ కార్డు రద్దు అవుతుందని గతంలో పేర్కొంది. అయితే తాజాగా గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పాన్‌ కార్డుతో ఆధార్‌ అనుసంధానానికి మరోమూడు నెలలు పెంచింది.

ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 138ఏఏలోని సబ్‌సెక్షన్ 2 ప్రకారం ఆధార్, పాన్ కార్డును కచ్చితంగా అనుసంధానం చేసుకోవాలి సీబీడీటీ ట్విట్టర్ వేదికగా పేర్కొంది. సీబీడీటీ ఆధార్, పాన్ అనుసంధాన గడువును పొడిగించడం ఇది వరుసగా 8వ సారి కావడం గమనార్హం. గతేడాది సెప్టెంబర్ నెలలో సుప్రీం కోర్టు.. కేంద్ర ప్రభుత్వపు ఆధార్ కార్డు రాజ్యంగబద్ధంగా అర్హత కలిగి ఉందని పేర్కొంది. దీంతో కేంద్రం ఆధార్, పాన్ నెంబర్లను లింక్ చేసుకోవాలి కోరుతూ వస్తోంది. పాన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు పొందటానికి అర్హులు. అదేసమయంలో వారి ఆధార్ నెంబర్‌ను కచ్చితంగా ట్యాక్స్ అధికారులకు అందజేయాల్సి ఉంటుంది.

Related posts