telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

రోజుకు 95 వేల పరీక్షలు చేస్తున్నాం: కేంద్రం

Corona

దేశంలో కరోనా వైరస్ శరవేగంగా దూసుకుపోతుంది. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీల్లో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇదే సమయంలో రికవరీ రేటు పెరిగిందని, మరణాల రేటు 2.2 శాతానికి తగ్గిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది.మరోవైపు నిత్యమూ అత్యధిక కేసులు వస్తున్నాయి. దీంతో కేసులు రెట్టింపు కావడానికి అయ్యే సమయం తగ్గుతూ వస్తోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ప్రపంచంతో పోలిస్తే, ఇండియాలో మరణాల రేటు తక్కువగానే ఉందని ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్ తాజాగా వ్యాఖ్యానించారు. దేశంలోని కరోనా బాధితుల్లో 1.1 శాతం మంది తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని, వెంటిలేటర్లపై 3.3 శాతం మంది, ఐసీయూలో 4.8 శాతం మంది ఉన్నారని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం రోజుకు 95 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 13.57 లక్షల మందికి పరీక్షలు నిర్వహించామని అన్నారు.

Related posts