telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

అదనపు తరగతి గదుల నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలి – మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

  బంజారాహిల్స్ ఎన్ బి టి నగర్ లో ప్రభుత్వ హై స్కూల్  కు  ఆనుకొని ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన ఖాళీ స్థలంలో అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ ను కోరారు. మంగళవారం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ తో కలిసి మేయర్ గద్వాల్  విజయలక్ష్మి ఖాళీ  స్థలం ను పరిశీలించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. హై స్కూల్ పక్కన ఉన్న ఖాళీ స్థలం అన్యాక్రాంతం చేసేందుకు కొందరు ప్రయత్నం చేశారని, దాన్ని అడ్డుకోవడం జరిగిందని మేయర్ తెలిపారు. అట్టి ప్రభుత్వ భూమిలో పాఠశాల అదనపు గదుల నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయించినట్లు ప్రభుత్వ స్థలాన్ని విద్యా శాఖకు కేటాయించిన తర్వాత పాఠశాల అదనపు గదుల భవన నిర్మాణం కొరకు రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు రూ.2 కోట్ల రూపాయలు ఇచ్చుటకు అంగీకరించారని   అందుకు అంచనాలు తయారు చేయాలని కలెక్టర్ ను కోరారు.

ఈ సందర్భంగా మేయర్ జిల్లా కలెక్టర్ తో కలిసి తరగతులకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. ఖాళీ స్థలంలో ముళ్ళ పొదలు పిచ్చి మొక్కలు ఉండడం వలన క్రిమి కీటకాల, విష పురుగులు రావడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు మేయర్, కలెక్టర్ కు వివరించారు. జిల్లా కలెక్టర్ డీఈఓ కు, విద్యాశాఖ మౌలిక సదుపాయాల శాఖ ఇంజనీర్ ను ఆదేశిస్తూ వెంటనే అంచనాలు తయారు చేసి నివేదిక అందజేయాలని ఆదేశించారు.

Related posts