telugu navyamedia
తెలంగాణ వార్తలు

కేసీఆర్ వస్తారని జనగామలో ఏర్పాట్లు..

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ప్రజా ప్రతినిధులు, రేపు ఉన్నతాధికారులతో సమావేశమైన తర్వాత జిల్లా పర్యటనలు చేపట్టనున్నారు. ఈ నెల 20 తేదీన జనగామ జిల్లాలో పర్యటిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జనగామ కలెక్టరేట్ సమీకృత జిల్లా కార్యాలయాలలో పనులను వేగవంతం చేశారు.

పనుల తీరును జిల్లా కలెక్టర్ శివలింగయ్య స్వయంగా పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్బంగా ఎలాంటి ఇబ్బందుల్లేకుండాచూడాలని అధికారులు బాధ్యతాయుత పాత్ర పోషించాలని కోరారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారులతోకలసి హెలిప్యాడ్ ఏర్పాటు, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.

ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో మంత్రి కోసం ఏర్పాటు చేసిన ఛాంబర్, అధికారులకు కేటాయించిన గదులను పరిశీలించారు. తుదిమెరుగులు దిద్దుకుంటున్న కార్యాలయ సముదాయాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని కోరారు.

ముఖ్య మంత్రి కేసీఆర్ జిల్లా పర్యటన నేపధ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు , జిల్లా కలెక్టర్ తో కలసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అదనపు కలెక్టర్లు భాస్కర్ రావు, అబ్ధుల్ హమీద్, డిసిపి శ్రీనివాస్ రెడ్డి, ఆర్ అండ్ బి ఎస్.ఈ.నాగేందర్ రావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Related posts