telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

రైతుల ఆందోళనలపై వెంకయ్యనాయుడు…

venkaiah Naidu Bjp

ఢిల్లీలో రైతుల ఆందోళన పై వెంకయ్యనాయుడు స్పందించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన సుదీర్ఘంగా కొనసాగుతూనే ఉంది.. అయితే, రైతుల ఆందోళనపై స్పందించారు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. మీడియాతో ఇష్టాగోష్టిగా ఆయన మాట్లాడుతూ.. రైతుల ఆందోళన వల్ల నెలకొన్న ప్రతిష్టంభన మంచిది కాదన్నారు.. సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కారం కావాలన్న వెంకయ్య… ఇరువైపులా ఆ దృక్పథంతో చర్చలు జరపాలన్నారు.. అయితే, మారుతున్న పరిస్థితులు, ఆధునికతను కూడా దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. కాగా, కొత్త చట్టాలతో ఎలాంటి నష్టం లేదని ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ.. ఈ చట్టాలు అమలు చేయడం తప్పనిసరికాదని పార్లమెంట్‌ సాక్షిగా వ్యాఖ్యానించారు.. రైతులతో చర్చలకు తాము ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక, రైతు సంఘాలు కూడా చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నాయి. చుడాలిమరి ఈ చర్చలోనైనా ఈదిన ఫలితం వస్తుందా… లేదా అనేది.

Related posts