telugu navyamedia
సామాజిక

గూగుల్ ట్రాన్స్‌లేట్ లో ఈ మూడు పదాలే ఎక్కువగా…

100 Billion Words Google Super Bowl Commercial 2019

సెర్చింజన్‌గా గూగుల్ కు ఎంత ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఆధునిక యుగంలో ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చాక గూగుల్ కు ఇంకా ప్రాధాన్యత పెరిగిపోయింది. ఏం చేయాలన్నా గూగుల్… గూగుల్… స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు వాడే వారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు గూగుల్ అవసరం ఉంటుంది. అయితే తాజాగా గూగుల్ ట్రాన్స్‌లేట్ పై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. ఎందుకంటే గూగుల్ ట్రాన్స్‌లేట్ ప్రతిరోజూ సుమారు 100 బిలియన్ అంటే 10 వేల కోట్ల పదాలను గూగుల్ ట్రాన్స్‌లేట్చేస్తోందని గూగుల్ స్వయంగా ప్రకటించింది. దీనికోసం ప్రత్యేకంగా #GoogleTranslate ఓ యాడ్ ను క్రియేట్ చేసి 100 బిలియన్ వర్డ్స్ పేరుతో యూట్యూబ్, ట్విట్టర్‌లో ఈ యాడ్ పోస్టు చేసింది. ఇందులో భాగంగానే గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో ఎక్కువగా How are you?, I love you, Thank you అనే పదాలనే ఎక్కువగా టైప్ చేస్తున్నారట. ఆ వీడియోను మీరు కూడా తిలకించండి.

Related posts