జనసేన పార్టీ గుంటూరు కార్యాలయంపై గుర్తు తెలియని వక్తులు దాడి చేశారు. అయితే ఈ దాడి రాత్రి సమయంలో జరగటంతో పోలీసులు ఘటన స్థలికి చేరుకోడానికి సమయం పట్టింది. ఈ లోపే దుండగులు బీరు సీసాలతో దాడి చేసి వెళ్లిపోయారు. ఈ దాడిలో కార్యాలయం అద్దాలు పగిలినట్టు తెలుస్తుంది. రాత్రివేళ కావటంతో ఎవరికి ఏమి కాలేదనే తెలుస్తుంది.
ఈ దాడి ని అడ్డుకున్న సెక్యురిటి సిబ్బందిపైకి కూడా రాళ్లు విసిరారు. రాత్రి సమయంలో ఈ ఘటన జరగడంతో ఎవరు దాడి చేశారో కనుక్కోవడం కుదరలేదు. విషయం తెలిసిన పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం పార్టీ నేతలు సీసీ కెమేరా విజువల్స్ చూస్తున్నారు. మరోపక్క పోలీసులు సైతం రంగంలోకి దిగి , ఆ దాడి కి పాల్పడిన వ్యక్తుల కోసం ఆరా తీస్తున్నారు. అధికారులు కూడా సీసీ టీవీలలో ఫ్యూటేజ్ పరిశీలిస్తున్నారు. విచారణ అనంతరం వివరాలు తెలియరావచ్చు.