telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

విదేశాల్లో 6,300 మంది భారతీయులకు కరోనా!

Italy corona virus

ప్రపంచ వ్యాప్తంగా వివిధ అనే దేశాల్లో ఉంటున్న భారతీయులను కూడా కరోనా మహమ్మారి వదల్లేదు. దాదాపు 50కి పైగా దేశాల్లో 6,300 భారతీయులకు కరోనా సోకింది. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని అత్యధిక దేశాలు రవాణా నిలిపివేయడంతో విదేశాల్లో ఉన్న భారత పౌరులు స్వదేశానికి రావడం సాధ్యంకాలేదు. దాంతో ఎక్కడివాళ్లు అక్కడ చిక్కుకుపోయారు. ఏప్రిల్ 16 నాటికి 3,336గా ఉన్న విదేశాల్లోని కరోనా బాధిత భారతీయుల సంఖ్య గడచిన 9 రోజుల్లో రెట్టింపైంది. ఇప్పటివరకు 40 మంది చనిపోయినట్టు గుర్తించారు.

సింగపూర్ లో ఉంటున్న 90 శాతం భారతీయులకు కరోనా సోకినట్టు అధికారిక నివేదికలు చెబుతున్నాయి. గల్ఫ్ దేశాల్లోనూ భారత పౌరులకు ఈ మహమ్మారి బెడద తప్పలేదు. కువైట్, బహ్రెయిన్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈల్లో 2000కు పైగా మనవాళ్లు కరోనా ఇన్ఫెక్షన్ కు గురయ్యారు. విదేశాల్లో ఉన్న వారు రావడంతోనే భారత్ లో కరోనా వ్యాప్తి మొదలైంది. దేశంలో లాక్ డౌన్ విధించినందున విదేశాల్లో ఉన్నవారిని రావొద్దని భారత ప్రభుత్వం సూచించింది.

Related posts