టీటీడీ(తిరుమల తిరుపతి దేవస్థానం)లో అన్యమతస్తులకు చోటు కల్పించడం వివాదాస్పదానికి దారితీస్తుంది. ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి సమీప బంధువు క్రిస్టోఫర్ డేవిడ్‌ను… టీటీడీ బోర్డు డీఈఓగా నియమించినట్టు తెలుస్తుంది. అన్యమతస్తుడుగా ఉన్న క్రిస్టోఫర్‌ను టీటీడీకి చెందిన కీలక పదవి బాధ్యతలు అప్పజెప్పడంపై హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. గతంలోనూ అనేక వివాదాలకు కేరాఫ్‌గా క్రిస్టోఫర్ ఉండటం తో ఈ విషయం మరింతగా సమస్యాత్మకంగా తయారైంది.
గతంలో క్రిస్టోఫర్ అవినీతి ఆరోపణలతో పాటు అన్యమత ప్రచారం చేసిన ఆరోపణల్లో టీటీడీ సంస్థల నుంచి తొలగించబడ్డాడు. అయితే హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుని తిరిగి శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలోని డైరీ సైన్స్ డిపార్ట్‌మెంట్ హెచ్.ఓ.డి గా కొనసాగుతున్నారు. ఎలాంటి అర్హత లేకపోయినా జగన్ బంధువు కావడంతో ఏకంగా టీటీడీ డీఈఓగా క్రిస్టోఫర్‌కు పదవి కట్టబెట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రిస్టోఫర్ నియామకాన్ని వెనక్కు తీసుకోకుంటే.. ఆందోళన చేస్తామని హిందూ ధార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
హైద్రాబాద్ అభివృద్దికి వైఎస్ ఏనాడు అడ్డుపడలేదు: చంద్రబాబు