వైసీపీని చూసి టీడీపీ భయపడుతోందని, వైసీపీకి సరైన పార్టీ జనసేనేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పవన్ మాట్లాడుతూ కేసీఆర్ సైకిల్ చైన్ తెంపేశారని, సైకిల్ పాతబడిపోయిందని పవన్ ఎద్దేవా చేశారు. శాసనసభకే వెళ్లని ప్రతిపక్షనేత రాష్ట్రానికి అవసరమా? అని పవన్ ప్రశ్నించారు. ఏ పార్టీతోనైనా పొత్తు కావాలంటే బహిరంగానే ప్రకటిస్తాను, కానీ జగన్‌లా మోదీ కాళ్లు పట్టుకోనని మండిపడ్డారు.
టీడీపీకి మద్దతిస్తే నేరుగా మద్దతిస్తానే తప్ప, మీలా భయపడి దొడ్డి దారిలో ఇవ్వనని పవన్ జగన్‌కి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. 2014 లోనూ టీడీపీకి నేరుగానే తన మద్దతిచ్చానని తెలిపారు. మీలా భయపడి దొడ్డి దారిలో బీజేపీ, టీఆర్‌ఎస్ మద్దతు కోసం చూడలేదని జగన్‌ని విమర్శించారు. ఏపీలో కేవలం రెండు కుటుంబాలు మాత్రమే రాజకీయాలు చేయాలా? సామాన్యులకు రాజకీయం అవసరం లేదా? అని జనసేన అధినేత పవన్
ప్రశ్నించారు.