telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పట్టువీడని రైతులు : అర్ధరాత్రి భేటీ అయిన షా, రాజ్‌నాథ్, నడ్డా

అన్నదాతలు పట్టువీడడం లేదు. ఢిల్లీని చుట్టుముట్టేశారు. “ఢిల్లీ చలో” ఆందోళనలో మొత్తం 500 పైగా రైతు సంఘాలు పాల్గొంటున్నాయి. “ఢిల్లీ చలో” కేంద్ర ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పి. నడ్డా నివాసంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజనాధ్, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లు సమావేశం నిర్వహించారు. రైతుల డిమాండ్ల, ఇతర పరిస్థితులను సమీక్షించారు బిజేపి కీలక అగ్ర నేతలు. ఈ సందర్భంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన మాటల యుద్ధం, విమర్శలు, ప్రతి విమర్శల పై కూడా చర్చించారు కేంద్ర మంత్రులు. ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు నిర్దేశించిన బురారీ మైదానానికి ముందుగా ఆందోళన చేస్తున్న రైతులు వెళ్తే, ఆ తర్వాత ప్రతి డిమాండ్ ను, అంశాన్ని చర్చించేందుకు సిద్ధమని రైతులకు సూచించారు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా.

అమిత్ షా ప్రతిపాదనను తిరస్కరించారు రైతు సంఘాల నేతలు. ఎట్టి పరిస్థితుల్లో బురారీ వెళ్లేది లేదని తెగేసి చెప్పారు రైతు సంఘాల నేతలు. ఆందోళన చేస్తున్న రైతులందరినీ బురారీ మైదానానికి తీసుకెళ్లి “ఓపెన్ జైలు” లో నిర్బంధిస్తారనే భయాందోళనలను వ్యక్తం చేస్తున్నారు రైతు సంఘాల నేతలు. ఢిల్లీ లోకి ప్రవేశించే 5 రహదారులు—సోనిపట్, రోహతక్, జైపూర్, ఘజియాబాద్-హాపూర్, మధుర—దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు రైతులు. ఉత్తరాఖండ్ రైతు సంఘం అధ్యక్షున్ని “జంతర్ మంతర్” తీసుకెళ్తామని చెప్పి, “ఓపెన్ జైలు”గా ఉన్న బురారీ మైదానానికి పోలీసులు తెసుకెళ్ళారని ఆరోపించారు “భారతీయ కిసాన్ యూనియన్” అధ్యక్షుడు సూర్జిత్. ఇది ఇలా ఉండగా.. ఆదివారం “మన్ కి బాత్” ప్రసంగంలో కూడా మూడు వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను సమర్థిస్తూ మాట్లాడారు.

Related posts