telugu navyamedia
వార్తలు సామాజిక

పోలీసుల ముందు కూరగాయలు పారబోసి నిరసన

vegitables Road

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో నిత్యావసర సరుకులు, కూరగాయల రవాణాకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. లాక్‌డౌన్‌ విధించడంతో ఉపాధి లేకపోవడంతో ఎలక్ట్రీషన్‌గా పనిచేసే కార్తీక్‌ అనే యువకుడు కూరగాయలు అమ్ముకుంటున్నాడు. తమిళనాడులోని తిరువళ్లూరులో కూరగాయలు విక్రయించేందుకు మార్కెట్‌కు వెళ్తున్న అతడిని పోలీసులు అడ్డుకున్నారు.

కారణం చెప్పకుండా తనను రోడ్డు పక్కన ఎక్కువ సేపు ఆపడంపై సహనం కోల్పోయిన అతడు పోలీసులను ప్రశ్నించాడు. దీనిపై ఓ పోలీసు స్పందిస్తూ..నీ కూరగాయలను రోడ్డుపై పారబోయాలను కుంటే వెంటనే చేసెయ్‌ అని చెప్పడంతో పోలీసుల వ్యవహారశైలికి నిరసగా కార్తీక్‌ తాను తీసుకొచ్చిన కూరగాయలను పోలీసు జీపు ముందు పారబోశాడు. అతడు కూరగాయలను పారబోస్తుండటంతో పోలీసులు జీపును వెనక్కి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో తిరువళ్లూరు ఎస్పీ స్పందించారు. ఈ ఘటనకు కారణమైన ఇన్స్‌పెక్టర్‌పై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.

Related posts