telugu navyamedia
క్రీడలు వార్తలు

టీం ఇండియా 42 రోజులు ఖాళీగా ఉండాల్సిందేనా..?

డబ్ల్యూటీసీ ఫైనల్ లో సౌథాంప్టన్‌‌ వేదికగా భారత్, న్యూజిలాండ్ తలపడబోతోన్నాయి. ఈ మ్యాచ్‌లో ఆడటానికి భారత క్రికెట్ జట్టు జూన్ 2వ తేదీన ఇంగ్లాండ్‌కు బయలుదేరి వెళ్లనుంది. దీనికోసం అవసరమైన క్వారంటైన్‌ను ముగిసింది. ఆ దేశంలో కూడా మూడురోజుల పాటు క్వారంటైన్‌ను పూర్తి చేయాల్సి ఉంది. ఇక్కడి దాగా అంతా బాగానే ఉన్నప్పటికీ.. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తరువాత టీమిండియా పరిస్థితి ఏమిటనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. జూన్ 18వ తేదీన ఆరంభమయ్యే ఈ మ్యాచ్.. రెండు జట్లూ పోటాపోటీగా ఆడితే 22వ తేదీన ముగుస్తుంది. దీని ఫలితం ఎలా ఉన్నప్పటికీ.. కివీస్ జట్టు స్వదేశానికి వెళ్లిపోతుంది. ఆ తరువాతి షెడ్యూల్ మీద కాన్సన్‌ట్రేట్ చేస్తుంది. ఫైనల్ మ్యాచ్ ముగిసిన తరువాత టీమిండియా ఏం చేస్తుందనేది పజిల్. బీసీసీఐ డిజైన్ చేసిన షెడ్యూల్ ప్రకారం.. జూన్ 3వ తేదీన ఇంగ్లాండ్‌లో అడుగు పెట్టబోయే భారత జట్టు మళ్లీ అక్కడి నుంచి బయటపడేది సెప్టెంబర్‌లోనే. దాదాపు నాలుగున్నర నెలలు అక్కడే ఉంటుంది కోహ్లీసేన. నిజానికి- ఇంగ్లాండ్‌తో టీమిండియా అయిదు టెస్ట్ మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది. తొలి టెస్ట్ మ్యాచ్ ఆగస్టు 4వ తేదీన నాటింగ్‌హామ్‌లో ఆరంభమౌతుంది. జూన్ 22వ తేదీన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ముగిసిన తరువాత.. ఇంగ్లాండ్‌తో తొలి టెస్ట్ ఆరంభం కావడానికీ మధ్య నెలన్నర వ్యవధి ఏర్పడింది. అంటే 42 రోజుల పాటు భారత జట్టు ఇంగ్లాండ్‌లో గోళ్లు గిల్లుకుంటూ కూర్చుంటుందనేది స్పష్టమౌతోంది.

Related posts