telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘అరవింద సమేత’ మూవీపై జగపతి కామెంట్స్…

లాక్‌డౌన్ నేపథ్యంలో షూటింగ్‌లకు బ్రేక్ పడటంతో సినీ ప్రముఖులందరూ ఇళ్లకు పరిమితం అయ్యారు. ఈ క్రమంలో తాజాగా విలక్షణ నటుడు జగపతి బాబు ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తన సినిమాల గురించి ఆయన పలు విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తాను విలన్‌గా నటించిన అరవింద సమేతలోని తన సీన్ల గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ”అరవింద సమేతలోని కొన్ని క్లోజప్‌ సన్నివేశాల్లో నేను సరిగా నటించలేదు. ఈ విషయాన్ని ప్రేక్షకులు అంత ఈజీగా గుర్తుపట్టకపోవచ్చు. కానీ నా హావభావాలు అంత బాలేవు. ఆ రోజు నా మూడ్ బాగోలేక నేను అలా నటించి ఉండొచ్చు. అందుకే సినిమాలో నటించేటప్పుడు నా మూడ్‌ను కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నా. దాని వలన భవిష్యత్‌లో మంచిగా నటించే అవకాశం ఉంటుంది” అని ఆయన అన్నారు. కాగా ప్రస్తుతం ఈ నటుడు కీర్తి సురేష్ నటిస్తోన్న మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి చిత్రాలతో పాటు అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న పుష్ఫలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

Related posts