telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఈటల, హరీష్, రేవంత్ ల కొత్త పార్టీ?

తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జా వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. ఆయన పార్టీ, మంత్రి పదవికి రాజీనామా చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సంచలనం తెరమీదికి రానుందా? తెలంగాణా గడ్డపై కొత్త పార్టీ పురుడు పోసుకోనుందా? దీనికి ప్రస్తుతం అధికార పార్టీ టీఆర్ఎస్‌లో ఉన్న మంత్రులు ఈటల రాజేందర్‌, హరీష్‌రావు, కాంగ్రెస్ ఎంపీ ఫైర్ బ్రాండ్ నేత రేవంత్ రెడ్డి సారథ్యం వహించనున్నారా? అంటే ఔననే అంటున్నారు సోషల్ మీడియా జనాలు. ఈ విషయం అత్యంత సంచలనంగా ప్రచారం జరుగుతుండడం గమనార్హం. నిజానికి ఇక్కడ కొత్త పార్టీ ఏర్పాటు కొత్తకాదు వ్యక్తులే ముఖ్యం. కొత్త పార్టీ ఏర్పాటుకు పావులు కదుపుతున్నారంటున్న ఆ ముగ్గురు నేతలే అత్యంత కీలకం కానున్నారు. తెలంగాణా వాదులుగా ఈ ముగ్గురికి మంచి ఫాలోయింగ్‌ ఉంది. తెలంగాణా రాజకీయాల్లో ఈ ముగ్గరు నేతలకు అత్యంత ప్రాధాన్యం, ప్రజాదరణ ఉండటం కలివచ్చే విషయం. ఐహటే దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Related posts