telugu navyamedia
ఆంధ్ర వార్తలు

అప్పుల ఊబిలో చిక్కుకుంది. అమెరికా… ఎంత పెరిగిందో తెలుసా..?

కరోనా కారణంగా ఈ అగ్రరాజ్యం పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిందని అప్పటి నుంచి అంతకంతకు అప్పులు పెరుగుతూనే ఉన్నాయని ఆ శాఖ ప్రతినిధులు తెలుపుతున్నారు. కొన్ని అవసరాల కోసం దేశం అంతర్గతంగానే కాకుండా విదేశాల నుంచి కూడా రుణం తీసుకున్నట్లు గతంలో ఓ చట్టసభ సభ్యుడే తెలిపారు.

రోజురోజుకు ఈ దేశానికి చెందిన రుణాలు పెరిగిపోవడమే గానీ.. తగ్గడం లేదని కొందరు అంటున్నారు. అయితే తాజాగా వాటి వడ్డీ మరింత పెరిగిందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ దేశం మొత్తం బకాయిపడ్డ మొత్తం 30 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని ఆ దేశ ట్రెజరీ శాఖ వెల్లడించింది. కొవిడ్ నుంచి బయటపడేందుకు అప్పులు చేయాల్సి వచ్చిందని అవి ఊహించని స్థాయికి చేరాయని కమిటీ అంటున్నారు.

Related posts